
గామె జగాన్నేలిన అతిలోక సుందరి! గీ జనాల మనసుల్ని దోచిన సిన్మానటి!! గప్పట్ల గామె కోసమే జనం ఎగబడ్డరు. యిగ గామె సిన్మాలుంటే సాలు ఆడుడే ఆడుడు! సోర పోరగాండ్ల నుంచి ముసలి ముత్కల దాకా సూసుడే సూసుడు!! గామెతోని సిన్మాలు తీసినోల్లకి కాసులే కాసులు!!! గామె బుట్టల పడనోల్లెవలు? ఇగ మనమైతే లొట్టలేసుకుంట సూసినం, మర్సి పోయినం. గామె పానం పోయినంక ఆయింత గురుతు గూడ సేసుకుంటలేం? గా అరమోళ్ళైతే నమిత, కుష్పూలకు ఖుషీగా గుడులే కట్టిండ్రు. గా మహారాష్ర్టపోల్లు మనలెక్క గాదుల్ల. అరవమోల్ల లెక్క గాకపొయిన, ముంబై లోఖండ్వాలల ఓ చౌక్ కి శ్రీదేవి పేరు పెట్టిండ్రు. గామెను మర్సిపోకుండ ఉంటాల్నని ‘శ్రీదేవి చౌక్’ని 2024 అక్టోబర్‌ల మొదలు పెట్టిండ్రు. గీ ముచ్చటకి శ్రీదేవి పెనిమిటి బోనీ కపూర్, బిడ్డలు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ లను గూడ పిల్సిండ్రు. గ్రీన్ ఏకర్స్ రోడ్ సమీపంల, శ్రీదేవి ఇంటి దగ్గర్నే గది ఉంటదంట. గదే రోడ్డుగాకున్న, గా అతిలోక సుందరి పేరు గీ జగముల నిల్చిపోయే జాగలెక్క మిగిలింది. మనకు యెన్నో యిచ్చినోల్లకు మనమేం యివ్వగలమని సోచాయించుడు గాదు. గిట్ల యేదో ఒకటి సేయాలె. నిజమే గద. యేమంటరు?

