మన ఆడోల్లు ఎంత ఇకమతులు పడ్డా అరవై పది దినాలకు గా గ్యాస్ స్టౌ బర్నర్లు మురికి పడతనే ఉంటయి. గ వాటిని కడగాల్నంటే మస్తు తిప్పలైతది. అల్కగ గా బర్నర్ల మురికిని తీసేసి, శిటికెల మెరిసేటట్లు శేసే ఇకమతు గిది సదువుండ్రి.

మన కడుపుల గ్యాస్ లెక్క వచ్చి ఉబ్బి.. తబ్బిబ్బై పోతుంటం గద. గదానికి వాడే ఇనో పాకెట్ ను తీసుకోవాలె. గా పొడిని గా గ్యాస్ స్టౌ బర్నర్ల మీద పోయాలె. ఐటెంక నిమ్మకాయ రసాన్ని గా పొడి మీదనే పిండాలె. కొంచెం సేపైనంక.. గదాన్ని గిన్నన్ని నీల్లు పోసి బట్టతోటి తుడవాలె. ఇగ గా బర్నర్లు కొత్తవాటి లెక్క తలతల మెరుస్తయి. మరి, మీరూ శేసి సూడుండ్రి.

