అవుమల్ల నిజమే! బస్సో, కారో, సైకిలో, సైకిల్ మోటరో ఇగ ఏదో ఒకదాని మీద పోతుంటం. పుసుక్కున గా ట్యూబు టైర్లు పేలుతయి. లేకపోతే పంక్చర్ అయితయి అనుకోండ్రి? ఏం శేస్తం? ఉంటే స్టెపినీ బిగిస్తం. లేకపోతే గదాన్ని గాడనే వదిలేయాలె! ఎవర్నన్న పిలిసి బాగు శేపియ్యాలె. ఇగ గిదీనికి మస్తు టైం పడ్తది. కట్టమైతది. గిదంతా లేకుండా ఒకాయినె గిట్ల తిప్పలు పడేటోల్లకు ఆసరా అయితాండు.

ధర్మపురి మండలం దొంతాపూర్ కు శెందిన అక్సర్ ఓ పాత స్కూటర్ కు గాలిని నింపే మిషిని బిగించుకుండు. ఇగ సుట్టుముట్టు ఎవలికన్నా, గిట్ల బండ్లు పంక్చర్ అయిందని పోన్ శేస్తే చాలు, నిమిషాల్ల అక్కడ వాటిపోతుండు. గవాటిని బాగుశేసి, డబ్బులు తీసుకుంటుండు. మంచిగుంది గదా? గీ మోబైల్ పంక్చర్ అతుకుడు, గాలి కొట్టుడు.

