పలకంటే అ ఆ ఇ ఈ అచ్చరాలు దిద్దేది. పంతుల్లు గా పలక మీదనే అచ్చరాలు రాసి, దిద్దిపిత్తరు. ఇగ పోరగాండ్లు అమ్మ ఒడిలకంటే, బడిలనే అచ్చరాలు నేర్సుకుంటరు. గట్లనే అచ్చరాలు, అచ్చరాలు కలిపి పదాలను రాసుడు కూడా నేర్సుకున్నం. గియన్నీ గా పుస్తకాలల్ల సూసి రాసేటోల్లం. ఇగిప్పుడు గిదంత లేకుండ, గా పలక మీదనే పదాలు కూడా నేర్సుకునేటట్లు శేసిండో పంతులు. ఒక్క తెలుగే కాదుల్లా, హిందీ, ఇంగ్లిపీసు కూడా నేర్సుకోవచ్చట.

సంగారెడ్డి జిల్ల హత్నూర మండలం నాగారం స్కూల్ల కేతావత్ తావుర్యా నాయక్ అనే సారున్నడు. గాయినె ‘మై స్లేట్’ పేరుతో ఓ పలక తయారు శేసిండు. తెలుగు, హిందీల తలకట్టు దీర్ఘాలు, ఒత్తులు, ఇంగ్లిపీసుల ఏబీసీడీలు గా పలకకు మూడు దిక్కుల రాసి పెట్టిండు. ఇగ గవాటిని కలుపుకుంట పోతే పదాలైతయి. పోరగాండ్లకు పుస్తకం లేకుండనే నాలుగచ్చరాల వరకు పదాలు నేర్సుకోవచ్చట. అన్నట్లు గిదీనికి గా సారు పేటెంట్ కూడ తీసుకున్నడటుల్లా. గ పలకల్ని ఉచితంగ గూడ అందిస్తాండట. సారు సల్లగుండ మంచి పనే శేత్తాండు గద?

