ఎక్కువ సేపు ఉడికేటివి, తొందర్గ ఉడకాల్నంటే ఏం శేత్తం? కుక్కర్ల ఏత్తం. మరి గా కుక్కర్లు కాస్త ఎసరు ఎక్కువ పోస్తిమా… ఇగ గది గా యిజిల్ యేసేటప్పుడు బయటకు పొంగుతాంటది. లోపల ఎసరు లేక మాడిపోతాంటది. బయటనేమో బాగా మురికైతది. గిదీనికి గిట్ల గాకుండ ఓ ఇకమతు శేసిండ్రు.

కుక్కర్ల పప్పు ఉడకబెట్టాల్నంటే. గా పప్పు ఎసరుతోపాటు ఓ శిన్న గిన్నెను గా కుక్కర్లనే పెట్టాలె. అండ్ల గిన్నన్ని నీల్లు పొయ్యాలె. కూక్కర్ కు మూత పెట్టి, గట్టిగ మంట పెట్టాలె. అయినా, ఇగ గా కుక్కర్ల పప్పు పొంగది. ఎసరు గింత గూడ బయిటికి రాదు. ఎట్లుంది గీ కిటుకు? మీరూ శేసి సూడుండ్రి.

