యిల్లు కట్టి సూడు, పెండ్లి సేసి సూడన్నరు. పెండ్లి లెక్కనే యిల్లు గూడ వందేండ్ల లెక్క. గందుకే జీవితంల ఒకపారి కట్టే యిల్లు మంచిగుండాలనుకుంటం. గట్లనే కట్టుకుంటం. కనీ, గా ఇండ్ల గోడలకు పల్గుడొస్తాంటే గుండె పల్గుతది. మరి గసొంటి పల్గుడు రాకుండా ఓ యికమతు శేసిండ్రు.

ముందుగనే నై తీత్తం. పిల్లర్లేత్తం, బెడ్లు పోత్తం కద..ఇగ గా పిల్లర్లను గీ పోటువల సూయించిన లెక్క డిజైను శేయాల్నట. పిల్లర్లను సాపుగ, పొడుగ్గ ఏయకుండ, మద్దెల మద్దెల గి పిల్లరు ఉబ్బి బయటికి వచ్చేటట్లు ఏయాల్నట. ఇగ ఐటెంక పెట్టే గోడలకు మంచి పట్టు ఉంటదట. ఎట్లుంది గీ ఇకమతు?

