పూటకూళ్ళ ఇండ్లు గదేనుల్ల.. ఓటల్లు, కొత్త కొత్త టూర్లకు పోయినప్పుడు గీ అద్దాలతోటి జె పైలముల్లా! గా అద్దాలు రెండు రకాలుగుంటయట? గయేందో? గవాట్ని ఎట్ల గుర్తు పట్టాల్నో సూద్దాం.

కొత్త ప్రదేశాలు, పెద్ద ఓటల్లకు పోయినప్పుడు మరీ ముక్యంగ ఆడోల్లు పైలంగుండాలె. గవాట్ల బాతు రూముల్ల, బట్టలు మార్సుకునే సోట్ల అద్దాలు పెడ్తాండ్లు. గయిట్ల బయటకు కనిపించనియి, అటు ఇటు కనిపించేయి ఉంటయట. గవాట్ని ఎట్ల గుర్తుపట్టాల్నంటే… ఓ పేపర్ ను లేకపోతే టిష్యూ పేపర్ తీస్కోవాలె. గదాన్ని గా అద్దానికి దగ్గరకి ఆనియ్యాలె. గప్పుడు మనం పెట్టిన పేపరుకు, అద్దంల కనబడే పేపర్ కు సందులెక్క వచ్చిందనుకోండ్లి గది, బయటకు కనిపంచని అద్దమన్నట్లు. ఒకేల గా సందు లేదనుకోండ్లి గది, గటుగిటు కనిపించే అద్దమన్నట్లు. మంచిగుంది కద గీ టిక్కు.

