పెండ్లంటే నూరేళ్ళ పంట. గందుకే ఆకాసమంత పందిరి, భూదేవంత పీటలేసి పెండ్లిల్లు శేత్తరు. ఉన్నోల్లు కోట్లకు కోట్లు కర్సు పెడ్తరు. కనీ, గీ వీల్లు గవన్నీ శేసిండ్లు. గంతకు మించి, పెండ్లి పిల్ల మీద కోట్ల నోట్ల కట్టలు కుమ్మరించిండ్రు. ఇగ వాన పడ్డట్లే గా నోట్లను గా పెండ్లి పిల్ల మీద ఏస్తనే ఉన్నరు. గిదీన్ని పోన్లల్ల ఈడియోలు తీసి, సోషల్ మీడియల పెట్టిండ్లు. గది సూత్తాంటే వైరల్ గ మారింది.

గీ ముచ్చట పంజాబ్ లోని తరన్ తారన్ జిల్లాల ఓ పెండ్లిల్ల జరిగింది. గా ఈడియోల పెండ్లి పిల్ల యేదిక దగ్గర నిలబడి ఉంది. గామె మీద నోట్ల కట్టలను ఇప్పి వెదజల్లుతున్నట్లు కనిపిస్తున్నది. అయితే, గా పెండ్లి పిల్ల మీద గవాళ్ళు మొత్తం రూ.8.5 కోట్ల విలువైన నోట్లను వెదజల్లినట్లు ప్రచారం జరుగుతోంది. ఏ తియ్ గదంత తప్పు. రెండు లచ్చలే! అని గావాళ్ళంటాండ్లు. ఇగ గీ పెండ్లి ఫిబ్రవరి 14న జరిగిందట. పెండ్లంటే గిట్లనే శేయాల్నా? ఏంది?

