కజ్జూర పండ్లంటే ఎవరికైన ఇట్టమే. లొట్టలేసుకుంట చప్పరిస్తం. ఇగ శిన్న పిల్లలైతే గయి మస్తుగ తింటరు. గయి మనకు మస్తు బలాన్నిస్తయి. గయి గీ కాలంలనే దొరుకుతయి. గవాటిని నోట్లేసుకుని, పండును తిని గింజల్ని ఎక్కడపడితే, అక్కడ ఉమ్మేస్తం. కనీ, గవాటి గింజల్ని తియ్యాల్నంటే అల్కటి ఉపాయాన్ని సూడుండ్లి.

ఒక దారం తీసుకోవాలె. గ దారాన్ని గా పండుకు మద్దెల పెట్టి ఓ సుట్టు మెలికె తిప్పాలె. దారాన్ని గుంజాలె. గంతే గా కజ్జూర పండు సగానికి తెగిపోతది. గా పండును రెండు ముక్కలుగ తీయాలె. ఒగదాంట్లె ఉన్న గింజను తీసెయ్యాలె గంతే! ఇగ గిట్ల శేస్తే పిల్లగాండ్లు, పెద్దలు మంచిగ గా పండ్లను తినొచ్చన్నట్లు.

