రోగాలెక్కువైనయి కాబట్టి ఆరోగ్యం మీద ధ్యాసెక్కువైంది. బియ్యమన్నం తింటే, బీపీ, షుగర్లొత్తానయని, ఇగిప్పుడంతా శెపాతీలు తినబడ్తిరి. మరి గా శెపాతీలు బుస్సున పొంగి, కమ్మగుండాల్నంటే ఏం శేయాల్నో తెలుసా?

ఇగో గా శెపాతీల్ని కాల్సెటప్పడు… తాల్చిన శెపాతీని పెనం మీద ఏసినంక, ఓ గిలాసకు మంచినూనె అంటించి ఒత్తాల్నట. గట్ల ఒత్తుకుంట, తిప్పుకుంట గా శెపాతీని కాలిస్తే, గది బుస్సున పొంగుతదట. మెత్తమెత్తగ కమ్మగ ఉంటదట. మరి మీరూ శేసి సూడుండ్లి.

