ఉపాయం ఉంటే ఊరేగొచ్చు. ఇకమతుతోటి ఎంతటి కట్టమైన పనినైనా అల్కగ శేయేయొచ్చు. గసొంటిదే గీ ఇకమతుపాయం. ఒక ఇనుప పైపుల, ప్లాస్టిక్ పైపు మరలతోటి ఇరుక్కుపోయిందనుకోండ్లి! ఎట్ల తీస్తం?

ఇగో, ఒక తాళం చెవిని తీసుకోవాలె. గదాన్ని కొంచెం యేడి శేయాలె. దాన్ని గా ఇనుప పైపులోని ప్లాస్టిక్ పైపుకు ఒత్తి పట్టి, దాన్ని గట్టిగ పట్టుకున్నంక, గదాన్ని నీల్లు పోసి సల్లగ శేయాలె. ఇగ గా తాళం చెవిని పట్టుకుని కట్టింగ్ ప్లేయర్ తో తిప్పాలె. గంతే! గది శిడెంల బయటకు వత్తది. ఎట్లుంది గీ కిటుకు?

