ఒకప్పుడైతే కొందరికే ఎడ్లబండ్లుండేవి. గిప్పుడైతే అందరికీ బండ్లే! గదేనుల్లా…ఒక్కొక్కలికి రెండు మూడు రెండు గిర్రల బండ్లు, నాలుగైదు నాలుగు గిర్రల బండ్లుంటానయి. గండ్ల పెట్రోల్, డీజిల్ పోస్తనే గయి నడుస్తయి గదా? మరి గండ్ల పోసే పెట్రోల్ని, డీజిల్ని ఎట్ల కొట్టించాల్నో తెలుసా?
గా బండ్లల్ల పెట్రోల్ను, డీజిల్ను పోయించుకునేటప్పుడు మనం ‘మెల్లెగ పోయి’ అంటం. కనీ గా మెల్లెగ పోస్తే పెట్రోల్ తక్కువ వస్తదట!? రువ్వడిగా పోస్తే పెట్రోల్ ఎక్కువ వస్తదట!? గీ కిట్కు తెల్వక మనమేమో మెల్లగ పోయి అంటం. ఇగిప్పుడు పెట్రోల్, డీజిల్ పోసుకునేటప్పుడు జెర జాగ్రత్తుల్లా! తెలుసుకుని మసలుకోండ్లి.

