పంటను పండించాలన్నా, పండిన పంటను దక్కించుకోవాల్నన్నా రైతుకు దిగులే. గుబులే. పంటను కాపాడుకోవడానికి, గా రైతు ఏం ఉపాయం శేసిండో సూడుండ్లి.

రాతెండి తలె, మందు డబ్బ, కట్టె, దారం పోస తీసుకున్నడు. ఓ గుంజను పాతిండు. మందు డబ్బను కుతికెల దాకా కోసి, యెడెల్పుగ ప్యాను లెక్క శేసిండు. గదాన్ని ఓ మూరెడు పొడుగు కట్టెకు గట్టిగ శెక్కిండు. గా కట్టెను గుంజకు కట్టిన ఓ ప్లాస్టిక్ పైపుల కెల్లి దూర్చిండు. గా కట్టె మరొక కొసకు గింతంత కట్టెను అడ్డంగా కట్టిండు. గదానికి తాడు బిగిచ్చిండు. గ తాడుకు తాకి సప్పుడు వచ్చేటట్లు గా రాతెండి తలెను పెట్టి కట్టిండు. ఇగ గాలికి గది తిరుగుతాంటె, గ తాడు రాతెండి తలెకు తగిలి బాగా సప్పుడు ఒత్తాంది. ఇగ గా సప్పుడుకు పశు పచ్చాదులు, కోతులు, పందులు, గొర్రెలు, మేకలు అసొంటివి రావన్నట్లు. ఎట్లుంది? గీ ఉపాయం?

