ఎంత జాగ్రత్త శేసినా, గా పోన్ల చార్జింగ్ వైరు కరాబైతనే ఉంటది. కొసలకు వైరు తెగిపోతనే ఉంటది. పాత బడి, శీకిపోయినట్లై శినిగిపోతది. మరి గి దీన్ని జాగ్రత్త శేయడాన్కి మస్తు ఇకమతులు పడ్తం. టేపులు సుడతం. వైర్లు వంగకుండ పైన ప్లాస్టిక్ రింగులసొంటియి పెడ్తం. కానీ, గీయనో ఇకమతు కనిపెట్టిండు. మీరే సూడుండ్లి.

గా పోన్ల చార్జింగ్ వైరుకు రచ్చన కవచంగా బట్టతోని ఓ అంగి తొడిగిండు. అంటే, గా వైరు మీదికెల్లి ఓ దొడ్డు బట్టను కుట్టిండు. ఇగ గా వైరు మట్టిపట్టది. నల్లబడది. ఊకూకెనే ఇగిరిపోదు. తెగిపోదు. కావాల్నంటే గా బట్టను మార్చి మల్ల కుట్టుకోవచ్చు. ఇగ ఎప్పుడు సూసినా గా వైరు కొత్తగ అగుపడ్తది. గీ ఇకమతు గమ్మతుగుంది కదా!

