అప్పుడప్పుడు మనం తాళం శెవిలు మరిసిపోతం. ఒక్కోపాలి బండి డిక్కీల్నే తాళం శెవిలు పెట్టి, ఇగ గదాన్ని తెరవడానికి మస్తు కట్ట పడ్తం. కానీ గిదీనికి ఒకాయెన భలే ఇకమతు కనిపెట్టిండు. స్కూటీ లాంటి బండ్లకు సీటు కింద గింత డిక్కీ లెక్క తలం ఉంటది. ఇగ గండ్ల బెట్టినప్పుడే గదాన్ని తెరుసుడు ఎట్ల?

ఎట్లంటే… గదాని సీటు మీద ఓ గట్టి కర్రతోటి ఒక్క దెబ్బ కొట్టుండ్లి. దెబ్బకు గది తెరుసుకుంటది. లోపల కట్క ఊడి పోతది. ఇగో గిట్లనే గా దొంగలు గండ్ల పెట్టినయి ఎత్కపోతరట. మీరు గదాంట్ల విలువైన వస్తువులు, డబ్బులు పెట్టకుండ్లి. జెర జాగ్రత్త.

