పండించిన వడ్లు, మక్కలను రైతులు రోడ్ల మీద పోసే ఆరబెడుతున్నరు. గవాటితోటి మస్తు పమాదాలు జరుగుతానయి. శానా మంది పానాలు పోతానయి. గట్ల గాకుండ, గా వడ్లను మేడలు, మిద్దెల మీద గూడ ఆరబోసుకుంటాండ్లు. గట్ల శేస్తే గా వడ్లను పైకి ఎత్తుడు, కిందికి దింపుడు గూడ కట్టమే కదా? అయితే, గి దీనికి గూడ ఓ రైతు కుటుంబం మంచి ఇకమతు శేసింది.

గా వడ్లను మిద్దె మీద ఆర బెట్టి, తూర్పాల పట్టినంక కిందికి అలకగా దింపిండ్లు. ఎట్లనో తెలుసా? బాగా ఆన పడితే, నీల్లు కిందికి పోయేటందుకు పైపు యేస్తం గద. గట్ల గా పైపు గుండ, పైన వడ్లను కిందికి జార పోసిండ్లు. ఇగ కింద గా పైపు కాడ బత్త పెట్టి దబాదబ నింపిండ్లు. మస్తుగుంది కదా గీ ఉపాయం!

