ఉపాయం ఉన్నోడు ఊరు మీదనే బత్తడని సామెత. గట్ల ఉపాయం శేసేటోనికి యాబోయినా గింత బువ్వ దొరుకతదన్నట్లు. గట్లనే ఉంది గీ ఇకమతు.

ఒకాయిన యెరైటీగ ఆలోశించిండు. ఎవ్వలు శేయని తీర్గ ఏదో ఒకటి శేయాల్నని అనుకున్నడు. ఇగ పాత డ్రమ్ములను తీసుకున్నడు. గదాన్ని మద్దెల అటింత ఇటింత ఒదిలి, రెండు దిక్కుల కత్తిరిచ్చిండు. కత్తిరిచ్చిన వాటికి ఇనుప సువ్వలు పెట్టి కుషన్ పెట్టి కుర్సీలు శేసిండు. మద్దెల మిగిలిన డ్రమ్మును టేబుల్ లెక్క ఉంచిండు. గవాటికి మంచిగ రంగేసిండు. కర్సు తక్కువ. క్రియేటివిటీ ఎక్కువ అన్నట్లు! ఇగ గి వీటిని సూసి, గా అన్న గిరాకీ కూడ పెరిగిందంట. మంచిగుందిగద. గీ ఉపాయం. మీరూ శేయండి.!

