బస్సుల్ల, కారుల్ల, రైళ్ళల్ల పయానం కొందరికి అస్సలు పడది. గవి ఎక్కంగనే వాక్కు వాక్కుమని ఒకటే కక్కుతరు. తల తిక్కతిక్కగ తిరుగతది. నొత్తది. కడుపుల దేవినట్లైతది. పానం ఆగమాగమైతది. గసొంటోల్లకి పయాణమంటే పానం మీదకొత్తది. ఇగ గిట్లాంటిది లేకుండ ఓ శిట్కా సెప్త ఇనుండ్లి.

ఏం లేదుల్లా… ఒక అల్లం ముక్కని తీసుకోవాలె. గదాన్ని ఉప్పుల అటు ఇటు దొర్లిపియ్యాలె. ఇగ గదాన్ని నోట్లేసుకోవాలె. ఇగ పయానంలో కక్కుడుండది. తల తిరుగుడుండది. ఎట్లుంది? గీ ఇకమతు. కావాలంటే మీరు సేసి సూడుండ్లి.

