బరువు తగ్గాల్నని, కొవ్వు కరగాల్నని కోటొక్క మొక్కులు, నూటొక్క తిప్పలు పడ్తాండ్లు. జిమ్ములని, ఎక్సర్ సైజులని, నడకలని, మందులని, మాకులని… ఓ లచ్చలకు లచ్చలు కర్సు సేసినా, గవైతే తగ్గుతనే లేవు. ఇగ యాష్టకొచ్చి.. రంధి పడి ఇంకింత బరువైతాండ్లు. ఇగ గీ ఒత్తిడితోటి గుండెల్ల రైల్లు పరుగులు పెట్టి, బీపీలు, సుగర్లు, కిడ్నీలల్ల రాళ్ళు గూడ రాబట్టె! గివన్నీ పోవాల్నంటే కర్సు తక్కువ. పని ఎక్కువ శేసే వంటింటి శిట్కా ఒకటి ఎట్లుందో సూడుండ్లి!!

ఓ మూడు తమలపాకులు తీస్కోవాలె. ఓ అల్లం ముక్క గండ్లేయాలె. గండ్లనే ఓ మూడు యెల్లిపాయల్ని ఏయాలె. గవన్నింటినీ శిన్న రోట్లేసి, మెత్తగ దంచాలె. ఐటెంక గదాంట్లె గింత తేనె కలుపుకోవాలె. ఇగ గదాన్ని ముకం కడుగుడుతోటే, పరిగడుపున కడుపులకు తినాలె. గట్ల గిన్నన్ని రోజులు తినంగ తినంగ కొవ్వు కరుగుతదట. ఒల్లు తగ్గుతదట. బీపీలు, సుగర్లు, తగ్గి వందలకొద్ది రోగాలు గూడ రావట! ఎట్లుంది గీ శిట్కా? ఇంకెందుకాలెశం? గిదీన్ని అమురుతం లెక్క తినుండ్లి! ఆరోగ్యంగుండుండ్లి!!

