సొక్కమసొంటి యెండైనా… కొన్ని రోజులైనంక నల్లబడ్తది. ఇగ యెండి నగలైతే, ఒంటి మీదనే నల్లగై ఇకారంగా కపిత్తయి. మరి గవాటిని తెల్లగ నిగనిగలాడి, మెరిసేటట్లు ఎట్ల సేయాల్నో మీరే సూడుండ్లి!

ఓ గిన్నెల గింత తినే సోడ ఏయాలె. గదాంట్లనే గింత ఉప్పేయాలె. గవాట్లల్లనే సగం ముక్క నిమ్మరసం పిండాలె. గందుట్లనే గింత అంట్లుతోమే సబ్బు నీల్లను పోయాలె. ఇగ గండ్లనే కాసిన్ని యేడి నీల్లు పోసి, గవాటన్నింటినీ మంచిగ కలిపినంక, గండ్ల యెండి నగలు, యెండి వస్తువుల్ని మునిగేట్లు యేసి, ఓ పావుగంట ఆగాలె. ఇగ గా తర్వాత గవాట్ని తీసి సూత్తె… ఆశీరపోతరు! కొత్తగ తెల్లగ నిగనిగమని మెరుస్తూ కనిపిత్తయి. గంతే! ఎట్లుంది గీ ఇకమతు? కావల్నంటే… మీరూ శేసి సూడుండ్లి.

