పోలీసులంటే కఠినంగ కరడుగట్టినట్లుంటరు. గవాళ్ళను సూత్తేనే శాలా మంది భయపడతరు. ఒగోపాలి గీ పోలీసోల్లకంటే గా దొంగలే నయమనిపిస్తరు! గా ఖాకీ బట్టలేసుకున్నోల్లంత గట్లనే ఉంటరని కాదు గనీ. గీ పోలీసాయన మాత్రం మస్తు తేడాగా ఉండు. గాయినేం శేసింగో మీరే సూడుండ్లి.

ముంబైల ఒకాయినె మంచిగ మందేసిండు. కడుపుతోటి ఉన్న గాయినె పెళ్ళానికి గప్పుడే నొప్పులొచ్చినయి. ఇగ గాయినె కారు నడుపుకుంట దవాఖానాకు తన భార్యను తీసుకపోతాండు. గా దారిల పోలీసోల్లు డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టిండ్లు. గా కారును ఆపిండ్లు. ఇగ ఎట్లయిన తిప్పలేనని, ఉన్నదున్నట్లు శెప్పితేనే మంచిదని, గా తాగానియినె తాను తాగి ఉన్నానని, తన భార్యను దవాఖానాకు తీస్కపోతాన, ఇంక రెండే కిలోమీటర్లు పోవాల్నని అన్నడు. వదిలి పెట్టాల్నని గట్టిగనే బతిలాడిండు. పోలీసోల్లు ఇంటారు? ఇగ గా పోలీసాయిన జబర్ దస్త్ గ.. గా తాగినాయినను దించిండు. ఎనుక సీట్ల కూసోమని శెప్పిండు. తనంత తనే డ్రైవింగ్ సేసుకుంట హాస్పిటల్ కు తీస్కపోయిండు. గిదాన్నంతా ఎవరో ఓకాయినె ఈడియ తీత్తాంటే, ఇగో పోలీసులంటే సట్టాన్ని అమలు సేయడానికే కాదు. గిట్ల సేవలు గూడ శేత్తరని మంచిగ ఈడియ తీసి అందరికి పెట్టుండ్లని శెప్పిండు.
ఇగ గీ ఈడియ మస్తు వైరల్ అయితాంది. సూసినోల్లంతా గా పోలీసాయనకు బిగ్ సెల్యూట్ కొడ్తాండ్లు. మరి మనం గూడ సెల్యూట్ కొడ్దామా?!

