ఉపాయమున్నోడు ఉపాసముండట. పైసలు సంపాయించాలంటే కొత్తగ ఆలోశించాలె గంతే! అంటుండు గీ పెద్దాయినె. మరి మీరూ ఆలోశించుండ్లి.

పంపుచార్లు అతికే శాపుల పాత టైర్లు తెస్తడు. గవాటిని ఒకకేలి డిజైను లెక్క కోస్తడు. ఇగ గదాన్ని తిర్మమర్ల తిప్పుతడు. ఐటెంక గదానికి మద్దెల ఇంకో టైర్ల ముక్కతోటి బోలోట్లు పిట్టు జేసి అతుకుతడు. అయిపాయె. గది మంచిగ టబ్బు లెక్క తయారైతది. దాన్ని బజార్ల పెట్టి అమ్ముతడు. గదైతే మట్టి కుండలెక్క ఇచ్చకపోయి పల్గది. ఇనుపదాని లెక్క సిలుమెక్కదు. ఎన్నేండ్లైనా, ఎప్పుడు సూసినా కరాబు కాదు. ఎట్లుంది? పాత టైర్లను కొత్తగా శేసే గా పెద్దాయినె ఇకమతు?

