‘ఉపాయం లేనోడు ఉపాసంతో సచ్చిండట! గదే గా ఉపాయం ఉన్నోడు ఊరి మీద బతుకుతడట!!’ నిజంగనే గీ ఉపాయంతోనే గా పెద్దాయినె పునుగులేస్తున్నడు. పునుగే గదాని తీసిపారేయకండి. గాయినె ఏసే తీరు సూడుండ్రి.

ఎవ్వలైనా శేతితోటి పునుగులేత్తరు. కొందరైతే బట్టకు లేదా పాల్తిన్ కవర్ కు రంద్రం పెట్టి యేత్తరు. కానీ, గీ పెద్దాయినె ఓ మోస్తరు పెద్దగున్న కొబ్బరి శిప్పను తీసుకున్నడు. గదానికి కింద రంద్రం శేసిండు. ఇగ గా రంద్రం కాడ యేలు పెట్టిండు. గా పునుగుల పిండిని గండ్ల పోసిండు. రంద్రం కాడ యేలు తీసి, గా పిండున్న శిప్పల కుడి శేయి పెట్టి నూనెల పునుగులేత్తాండు. అలకగుంది గదా గీ ఇకమతు!?

