దొంగకు శెప్పే లాభమన్నరు. ఇగ దొంగలు గూడ ఏ లెక్కకు గా లెక్కనే ఉంటరట! కన్నం ఏసేటోడు, కిటికీల కేలి దూకేటోడు, తాళాలు తెరిసేటోడు, శైన్లు లాగేటోడు, బ్యాంకు అకౌంట్ల కెల్లి డబ్బు కాజేసేటోడు…గిట్ల ఒక లెక్కన శేసే దొంగ మరో లెక్క తెరువు పోడట! తులుపులు తెరిసి ఉన్నా, కన్నం వేసేటోడు గా కన్నమే ఏస్తడట!! గివన్నీ దొంగల లెక్కలు గా పోలీసులకే బాగా తెలుస్తయి గనీ. గీ లెక్కే యేరే తీర్గ ఉన్నది.

ఇగ లారీల టైర్లు కొట్టేసేటోల్లు గూడ ఉంటరు. గందుకని ఒకాయినె బలే ఇకమతు కనిపెట్టిండు. గా టైర్లకు ఇనుప తాళం తయారు చేసిండు. గదాన్ని గా టైర్లకు బిగించిండు. ఇగ గా దొంగలకు గా టైర్లను ఎత్తుకపోవుడు వాళ్ల తరం కాదన్నట్లు. ఎట్లుంది గీ ఇకమతు?

