ఆలుగడ్డ పొట్టు తీసి ఒండుకుని తింటం. కనీ గా ఆలుగడ్డ పొట్టుతీసుడంత అలకనేమీ కాదు. గవాటిని ఉడుక బెట్టి, కాస సల్లగైనంక పొట్టు తీస్తం. ఉడుకకపోతే గా పొట్టు రాదు. ఉడికితే గా పొట్టుతోటి ఆలుగడ్డ కూడా ఊసి వత్తాంటది. గిదంతా తిప్పలు లేకుండా ఆలుగడ్డ పొట్టుతీసే గీ ఇకమతు సూడుండ్రి.
ఉడుక బెట్టే ముందే గా ఆలుగడ్డలకు కత్తితోటి సుట్టూత గాటు పెట్టాలె. గవాట్ని నీల్లల్ల యేసి ఉడుక బెట్టాలె. ఇగ గవి ఉడికినంక ఆలుగడ్డను రెండు దిక్కుల పట్టుకుని పొట్టును లాగాలే. గంతే ఊకనే గా పొట్టు ఊసిపోతది. అవుమల్లా..! గీ ఇకమతును తినోటోల్లు సదివితే, వండేటోల్లకు కూడా సెప్పుండ్లి!!

