మనుసులు శేసే అన్ని పనుల్ల మిషిన్లొస్తానయి. యిగ మనుసులు గూడ మోటు పనులకు ఒంగుతలేరు. కట్టం తక్కువుండాలె. ఫలితం ఎక్కువుండాలె. గిదే గిప్పుడు నడుస్తున్న ట్రెండు.
గట్లనే కాస ఎక్కువ కట్టం ఉండే పని ఇండ్లు కట్టుడు. గా ఇండ్లు కట్టే పనుల్ల ఇప్పటికే ఉసికె జల్లెడ పట్టే మిషిని కానుంచి సిమిటి, ఉసికె, నీల్లను కలిపే మిక్సింగ్ మిషిని వరకు వచ్చినయి. ఇగ గిప్పుడు మిక్సర్ తో పని లేకుండ, శిన్న శిన్న ఇండ్ల పనులకు సిమిటి, ఉసికెను కలిపే మిషిని కూడా వచ్చింది. గిది గా యిండ్లుగట్టే మేస్త్రీలకు, కూలీలకు కట్టాన్ని తగ్గిస్తుందన్నట్లు.

