బీరువాల డబ్బలు దస్కం దాసుకుంటం. కుర్సీల మీద కూసుంటం. గిదీంట్లేముందంటరా? బీరువా సంగతి సరేనుల్లా. గీ కుర్సీ కూసుంటానికే గాదు, సీక్రెట్ లాకర్ లెక్క కూడ వాడుకోవచ్చు.
ఓ వడ్లాయినె ఏం చేసిండో సూడుండ్లి. కుర్సీని మామలుగనే తయారు జేసిండు. గదాంట్ల కింద సీక్రెట్ లాకర్ పెట్టిండు. కూసునే కుర్సీ కింద చిన్న శెక్కలతోటే పెట్టె లెక్క పెట్టిండు. గదానికి కింది నుంచే ఓ తాళం చేసిండు. మల్ల గదానికి మీదికెలి, శెక్క పెట్టెను అటు ఇటు గుంజుకుంటంట్లు జేసిండు. ఇగ డబ్బులు అండ్ల పెట్టుకోవాల్నెన్నా, తీయాల్నెన్నా, కుర్సీని కొంచెం పైకి లేపాలె. గా శెక్క మూతను జరపాలె. తాళం కనిపిస్తది. గది తీయాలె. ఖతం శెక్కపెట్టె తెరుసుకుంటది. మూసుకుంటుది. మంచిగుందగదా? గీ ఇక మతు. ఇగ మరి మీరూ శేయించుకోండ్లి. డబ్బులు దాసుకోండ్లి.

