అవుమల్ల! వీజీ అంటే వీజీనే? శాపల పులుసంటే శెవి కోసుకుంటం. కనీ గ దాని పొట్టు తీసుడు… గదేనుల్లా… పొలుసు తీసుడు, పొతం శేసుడంటే. మాటలు కాదు. పట్టుకుంటే జారిపోతాంటది. కోత్తే కోయరాదు. ఇగ పొట్టు తీయాల్నంటే వశం కాదు. కత్తులు కటార్లు పట్టుకుని ఓ యుద్ధమే సేయాలె. గవాట్ని కడిగి పొతం శేసి ముక్కలు శేయాల్నంటే తల పానం తొకకొత్తది. గనీ గా శాపలమ్మేటోళ్ళైతే, గదానిమీదింత తవుడో, శెక్క పొట్టో, బూడిదో సల్లి, జాగ్రత్తగ పట్టుకుని పొతం శేత్తరు. ఇగ గవాటితోని పనిలేని ఓ కిటుకు శెప్తా ఇనుండ్రి.
శాపను తీస్కోవాలె. గదాని మీద సన్న ఉప్పు సల్లాలె. ఐటెంక గదాని మీదనే నిమ్మరసం పిండాలె. ఇగ గవాట్ని మొత్తం కలిపి మంచిగ శాప మీద రుద్దాలె. పావుగంట పక్కన పెట్టాలె. గా టైం తర్వాత గ శాప మీద శెయ్యి పెట్టి రాత్తాంటే ఉట్టిగనే గా పొట్టంతా, గదేనుల్లా పొలుసంతా ఊసిపోతది. ఇగ గా శాపను మంచి కడిగి, ముక్కలు కోసి, పొతం శేసుకోవాలె. ఎట్లుంది గీ ఇకమతు. ఇగ మీ ఇండ్లల్ల మీరు గూడ గీ కిటుకును షురువు శేసి సూడుండ్లి.

