ఎసొంటి పానాపాయం లేకుండ ఉండేటందుకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, కార్ల ఆడకం మనకు తెలుసు. గసొంటియి ఆడాలంటే మస్తు కర్సైతది. గా కర్సు తక్కువతోటి సేమ్ గట్లనే పని శేసే టీ షర్ట్ ను తయారు శేసిండ్లు. గదెంట్లంటే…
ఒకాయినె ఓ టీ షర్టును తయారు శేసిండు. మామూలు టీ షర్టు మీద నుంచి కత్తితోటి పొడిస్తే పుస్సున దిగుతాంది. గదే గదాన్ని కత్తితోటి కసా కసా, కసాపిసా పొడిసినా గింత గూడ దిగుతలేదు. గా టీ షర్టు మస్తుగుంది కదా? మార్కెట్లకు వస్తే గదాన్ని కొనుక్కుంటే ఇగ ఎసొంటి సమస్యలుండయన్నట్లు. ఎట్లుంది గా టీ షర్టు?

