ఇగో మన ఇండ్లల్ల బయట ఫిట్ శేసే లైట్ బుగ్గలు, హోల్డర్లు ఎండకు ఎండి, ఆనకు తడిసి ఉత్తుత్తగనే కరాబైతయి. కొన్ని రోజులైనంక పక్కున పల్గిపోతయి. గట్ల గాకుండా, ఎవ్వలు ఎత్కపోకుండ ఇగ గీ ఇకమతు శేయిండ్రి.
గా లైటు బుగ్గ ఫిట్ శేయటానికి ముందు గది పట్టే ఓ ప్లాస్టిక్ డబ్బను తీసుకోవాలె. గా డబ్బ మూతను గోడకు పెట్టి మద్దెల పొక్క కొట్టాలె. గా రంద్రంల కెల్లి వైర్లు బయటకు తీసి హోల్డర్ గట్టిగ పెట్టాలె. గా హోల్డర్ కు బుగ్గను పెట్టినంక పైకెల్లి గా డబ్బను గా గోడకు ముందుగాల్నె పెట్టిన మూతకు పెట్టి, గట్టిగ ఊసిపోకుండ తిప్పాలె. గంతే! ఇక గా లైట్ బుగ్గకు రచ్చణకు రచ్చణ, భద్రతకు భద్రత. మంచిగుంది కదా గీ ఇకమతు. మీరూ శేయుండ్రి.

