
సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డ పంచాయతీలో అరుదైన రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. సాధారణంగా రైతులు, స్థానిక నాయకులు సర్పంచ్ పదవికి పోటీ చేసే గ్రామ రాజకీయాల్లో ఈసారి సాఫ్ట్‌వేర్ కంపెనీ యజమాని లావుడ్య రవీందర్ బరిలోకి దిగడం చర్చనీయాంశమైంది. బీటెక్, ఎంబీఏ చదివిన రవీందర్ విదేశాల్లో ఉద్యోగం చేసి, హైదరాబాద్‌లో స్వంతంగా సాఫ్ట్‌వేర్ కంపెనీ స్థాపించి, నడిపిస్తున్న ఆయన, గ్రామాభివృద్ధి కోసం రాజకీయ రంగంలోకి రావాలని నిర్ణయించుకున్నారు. ఈసారి సర్పంచ్ పదవి ఎస్టీ జనరల్‌కు కేటాయించగా, రవీందర్ డప్పు చప్పుళ్ళ మధ్య కుటుంబ సభ్యులు, మద్దతుదారులతో నామినేషన్ దాఖలు చేశారు. ఉన్నత చదువులు చదివిన వ్యక్తి సర్పంచ్‌గా వస్తే గ్రామానికి కొత్త ఆలోచనలు, అభివృద్ధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

