ఆకే కదాని తీసిపారేయొద్దు! పువ్వే కదాని పీకి పారేయొద్దుల్లా!! ఏ పుట్టల ఏ పాముందో! అన్నట్లు… గా ఏ ఆకుల ఏం బలముందో ఎవరికి ఎరుక?!
గిప్పటి దాకా మనకు ఆకులు, అలములల్ల ఔషధ గుణాలున్నయనే ఎరుక. ఇగ గీ ఆకుల్ల ఇనుముందటుల్లా? గయే గా తంగెడాకు, పులాయి ఆకులు. గా తంగెడు, పులాయి ఆకులను దంచి, మట్టి కుండల యేసి, మూత పెట్టి, జాగర్త చేయాలె. కొన్ని రోజులైనంక సూత్తే, గదాంట్ల ఇనుమును గట్టిగ చేసే కర్భనం అనే పదార్థం తయారైతదట. గదాంతోటే యెనకట గట్టి గట్టి కోటలు కట్టిండ్రట. 5 యేల యేండ్ల కింద ఉపయోగించిన గీ పదార్థాన్ని ఖనిజ పరిశోధకుడు జయకిషన్ మల్ల కొత్తగ కనిపెట్టిండు. సంగారెడ్డిల జరిగిన 79వ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెటల్స్ సదస్సుల గాయిన గదాన్ని పదర్శించిండు. అవుమల్ల మన ఆకుల్ల, అలముల్ల గింత బలముందా? అని అంతా అనుకుంటాండ్లు.

