‘నీల్లు పల్లమెరుగు.. నిజం దేవుడెరుగు!’ అన్నరు. నిజం సంగతేమో గనీ, నీల్లయితే పల్లానికే పోతయి గదా! నిజమా? కాదా? కనీ, ఓ దగ్గర మాత్రం నీల్లు మిట్టకు పోతున్నయుల్లా!?
గిదైతే నిజమో, అబద్దమో కనీ, గీ మద్దెల ఓ యీడియో నెట్టింట్ల చక్కర్లు కొడుతున్నది. గదాంట్ల ఒకాయినె నీల్లు పారే శిన్న సెలయేరుకు మద్దెల నిలబడ్డడు. శేతుల ఉన్న పేపరు ముక్కను గండ్ల యేసిండు. ఇగ గది పైకి పోబట్టె. అరె గిదేంది? నీల్లు గూడ మిట్టకు పోబట్టె. గా యీడియో తీసినాయినె గూడ గదెక్కడ్నో సెప్పలే. ఇగో గీ మద్దెల ఆర్టిఫీషియల్ ఇంటలీజెన్స్ అని ఓ టొచ్చిందిగదా? గది గీ టెక్నాలజీ మాయో, యీడియో శేసినోని మాయో గనీ, గి దీన్నైతే జనం ఎగబడి సూత్తాండ్లు.

