
తెలంగాణ గ్రామపంచాయతీ ఎన్నికల వేళ నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం లట్టుపల్లిలో సంచలన సంఘటన చోటుచేసుకుంది. ముగ్గురు సంతానం నిబంధన ఎత్తివేత, రిజర్వేషన్ రావడంతో అవకాశాన్ని వినియోగించుకోవాలనే ఉద్దేశంతో అమెరికాలో ఉంటున్న నందిని స్వగ్రామానికి హుటాహుటిన చేరుకుని నామినేషన్ దాఖలు చేయడం చర్చనీయాంశమైంది. ఆరేళ్లుగా అమెరికాలో పిల్లల వద్ద ఉండే నందిని, సర్పంచ్ స్థానానికి ఈసారి మహిళా రిజర్వేషన్ రావడంతో పోటీకి రెడీ అయ్యారు. కూతురు డెలివరీ సమయంలో ఉన్నా, గ్రామాభివృద్ధే ప్రధానం అని వెంటనే ఇండియాకు రావడం ఆమెను అందరూ షాకింగ్ గా చూస్తున్నారు. గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని నందిని విజ్ఞప్తి చేస్తుండగా, బరిలో అభ్యర్థులు ఎక్కువగా ఉండటం ఉత్కంఠ రేకెత్తిస్తోంది. అమెరికా నుంచి వచ్చిన నందినిని గ్రామస్తులు గెలిపిస్తారా? లేక తిరిగి పంపిస్తారా? అన్నది ఇప్పుడు లట్టుపల్లి గ్రామంలో హాట్ టాపిక్‌గా మారింది.

