యిల్లు కట్టి సూడు, పెండ్లి సేసి సూడన్నరు. అంటే యింటికి, పెండ్లి గంత పనుంటదన్నట్లు. ఇగో యిల్లంటే, యిల్లు కట్టాలంటే ఏంది? రాయి, సలాక, ఇటుక, ఇసుక, సిమిటి, నీల్లు, సెమట గదా! గవన్నీ కలిపి నెలల తరబడి కడితేగానీ యిల్లు కాదు. ఇగ మనం గా యిండ్లల్లకు పోలేం. కనీ, గా జపానోల్లు గివేవీ లేకుండనే యిల్లు కట్టుడు సురువు జేసిండ్లు.
తొమ్మిది, పది యిటుకలంత పెద్దగ యిటుకలను తయారు శేసిండ్లు. గా యిటుకలకు కట్కాల్లెక్క పెట్టిండ్లు. గా కట్కాలల్ల ఒకదాని మీద ఒకటి పెట్టి యిరికిస్తరు. గవాటిని మంచి కూసుండ పెడతరు. ఇగ గవి ఒకదానితోటి ఒకటి కలిసిపోయి, అస్తర్ కార్ శేసినట్లు సాపుగా ఉంటయి. అయిపాయె. గవాట్ని ఒకదాని మీద ఒకటి పెట్టి గోడలు కడతాండ్లు. గట్లనే యిల్లు మొత్తం గంటలు, రోజుల్లనే కడ్తరంట. ఎట్లున్నది గీ ఇకమతు?

