సలి కాలంల ఎట్లుంటది? సల్లగ సలి పెడతాంటది. ఇగ ఇగం పట్టి పొతాంటం. సలి కోట్లు యేసుకుని గరంగా ఉంటాంటం. ఇగ కొందరికి సలి పడది. కాళ్ళు, చేతులు, శెవులకు గూడ ఏదన్న కట్టుకోవాలె. లేకపోతే సలాగది. సలి మంట కాగాలె. దుప్పట్లు కప్పుకుని గరంగరంగ పండుకోవాలె.
ఇగ గీ సలి కోట్లను ఏడాదికోపాలి తీస్తం. కొన్ని పాతబడితే, కొత్తయి కొంటం. పతవాటిని పడేస్తం. గా పాత సలి కోట్లను పడేయకుండ ఒక ఉపాయం కనిపెట్టిండో ఇకమతులాయినె. పాత సలి కోటుకు శేతులుంటయి గద, గవాటి ముంజేతులను సాక్సుకు సరిపోయే సైజుల కట్ శేయాలె. ఒక కొసకు గదాన్ని శేతితోటో, మిషినితోటో కుట్టాలె. గంతే ఇగ గవాటిని సాక్సులెక్క యేసుకోవాలె!

