మనుండుంగ మంచినీల్లు పోయనోడు. సచ్చిపోయినంక సావుగంజి పోస్తనన్నడట. తల్లిదండ్రులకు అన్నం పెట్టని కొడుకులను చూస్తున్నం. తన్ని తగలేసిన బిడ్డలను చూస్తున్నం. కనీ, తల్లితోని తను కట్టుకున్న ఇంటికి రిబ్బను కోపిచ్చిన గిసొంటి కొడుకును మాత్రం ఎక్కడా సూడలే!
ఇగో, ఓ అన్న బాగా ఎదిగిండు. శాలా సంపాయించిండు. మంచిగ అద్దాల మేడ లెక్క యిల్లు కట్టిండు. ఇగ గా యింట్ల పాలు పొంగిపిచ్చి, గా యిండ్లల్లకు పోవాలె గద. గా మూర్తం పెట్టుకుండు. మంచానపడి లేవ లేకుండ అయిన అవ్వను రెండు శేతులతోని ఎత్తుకుండు. గా అవ్వ శేత రిబ్బను కోపిచ్చిండు. ఐటెంక గా యింట్లకు పోయిండు. కనిపెంచిన అవ్వ మీద పానం పెట్టి, పేమ సూపిచ్చిన గా కొడుకును సూసి, అవ్వ గర్వపడ్డది. గాయింత గిది సూసినోల్లు.. ఇగో, కొడుంకటే… గట్లుండాలె అనుకుంటాండ్లు.

