కూల్ డ్రింకంటే, శాయ నీల్ల కంటే సులకనైపాయె! పాలు తెచ్చుడు. కాగబెట్టుడు. శాయ జేసుడు, గిలాసలల్ల పోసుడు, మల్ల గవాటిని తోముడు, కడుగుడు పెద్ద పని. సక్కగ నాలుగు కూల్ డ్రింకు సీసాలు గాయింత గా ప్రిజ్జుల పెడితిమా… ఎవలొచ్చినా గది తెరువ, గా ప్లాస్టిక్ గిలాసలల్ల పొయ్య. గవాటిని పారెయ్య. అలకగ లేదూ?
గీ కూల్ డ్రింకుతోటి శేన్లకు పురుగుల మందు లెక్క కొట్టుడు, తుప్పు పట్టిన ఇనుప సామాను, మసిపట్టిన బోల్లు బొచ్చెలు కడుగుడే గిప్పటిదాకా జూసినం. గనీ గిప్పుడు గీ సల్ల సల్లని కూల్ డ్రింకుతోటి యేడేడి మంటల్ని గూడ ఆర్పొచ్చట! గా కూల్ డ్రింకులల్ల కార్బన్ డైయాక్సైడ్ ఎక్కువుంటదట. మంటల్ల గదిపోస్తే ఎంత బుగబుగ మండే మంటైనా గీ బుస్సున పొంగే కూల్ డ్రింకుకు తుస్సున ఆరిపోతదట. మంచిగుంది గదా? అగ్ని పమాదాలు జరిగితే గీ ఇకమతు బాగనే పని చేస్తదన్నట్లు!

