
ఇయ్యాల్రేపు అందరి శేతుల్ల ఫోన్లేనాయె! ఆఖరికి నిన్నమొన్న పుట్టిన పోరగాల్లకు కూడ పోన్లు శేతుల పెట్టి మురిసిపోతాంటిమి. ఊకె శేతుల పోనుంటే ఆగుతాది. ఊకె సూసుడేనాయె. సూడంగ సూడంగ జారి పడతది, గాయింత గా పోను కరాబైతాంటది. గందుకే గద, మనం స్క్రీన్ గార్డును ఏసుకుంటం. పొరపాట్ననో ఏమరపాట్ననో గా పోను కింద పడితే గాయింత గా స్క్రీన్ పల్గకుంట జాగ్రత్తపడ్తం.
ఇగ గా స్క్రీన్ గార్డ్ యేసే మిషిన్లను గా జపానోల్లు కనిపెట్టండ్రు. స్క్రీన్ గార్డు కరాబైన గా పోనును గా మిషన్ల పెట్టాలె. ఇగ గది గా పోన్ ను గుంజుకుని లోపలికి తీసుకపోతది. శిడెం సేపట్లనే పలిగిన స్క్రీన్ గార్డును తీసేసి, కొత్తదాన్ని యేసుకొని బయటికి వస్తది. గంతే! అంగిలాగు మార్సిన దానికంటే తొందరగనే గా మిషిని స్క్రీన్ గార్డును మార్సి ఇత్తది. ఎట్లుంది టెక్నాలజీ? జపానోల్ల తెలివే తెలివి గదా?!

