జడ. ఆడోల్లు, పిల్లలు అందంగా సవరించకునే ఎంటికెలు. సూడ్డానికి బాగుండే అల్లికలు. తలెంటికెల్ని మూడు గుత్తులుగ గుప్పిట్లకు తీసుకుని అల్లితే అయిపాయె. అనుకుంటం. గనీ, గిదొక్కటే కాదుల్లా.. జడల జడ లెక్క ఇగ గండ్ల గూడ మస్తు డిజైన్లు వచ్చినై. గీ జడ మీద పద్దాలు, పాటలే గాదు, ఏకంగా శతకాలే వచ్చినై. వరంగల్ ల ఉండే కంది శంకరయ్య గట్లనే వంద పద్దాలు సేకరించిండు. రాధాగోపాలం సిన్మాల బాపు, రమణలు ఓ జడ పాటను పేరడీల జొన్నవిత్తులతోని రాయించిండ్లు. గండ్ల గాయినంటడు. ఓ వాలు జడ. కనికట్టు జడా. కనిపెట్టు జడా. పనిపట్టు జడా. పని పెట్టు జడా అని. గిదంత బాగనే ఉంది గనీ, గా జడేసుడే పెద్ద పని. గది గా ఆడోల్లకే అబ్బిన యిద్దె. పనిపాట లేనోల్లయితే సరే గనీ, బడికిపోయే పిల్లలు, పనులకు పోయే, ఉద్దొగాలు జేసుకునే ఆడోల్లకైతే మస్తు తిప్పలైతది.
ఇగ గీ దీనికి గూడ ఓ మిషినొచ్చిందిల్లో…! ఏం లేదు. గా మిషిన్ల తలకాయి పెట్టాలె. గంతే శిడెంల గా మిషినే జడల్లుతది. ఇగ గండ్ల కెల్లి తలకాయె తియ్యాలె. అయిపాయె! ఏ డిజైన్ గావాలంటే గా డిజైన్ రెడీ. ఇగ గీ మషిన్లు మన దగ్గరుంటే, ఎంత బాగుంటది. కదా!? గా రోజు గూడ వత్తది తియ్యుండ్లి.

