మనలో కొందరం నీసుముచ్చోల్లముంటం. ముక్కలేందే బుక్క దిగదు. ఆకరికింత గుడ్డన్నండాలె. గా గుడ్డుతో శేసే అట్టన్నుండాలె. గదేనుల్లా. ఆమ్లెట్టు. గాయింత గుడ్లు తింటే బలమని శెప్పబట్టిరి డాక్టర్లు. ఇగ గుడ్లను తినేటోల్లకు గుడ్డు గుడ్డో, బ్యాడో తెలవకుంటైతాంది.
గా మద్దెల ప్లాస్టిక్ బియ్యమొచ్చినయి అంటే అంతా ఆగమాగమైనం. ఇగ గిప్పుడు నకిలీ గుడ్లు గూడొచ్చినయి. అంటాండ్లు. యినడానికి భయమైతాంది గద? కావాలంటే గవాటిని ఎట్ల తయారు శెత్తరో చూడుండ్లి.
గుడ్డుల తెల్లటి సొన లెక్క ముందుగ తయారు శేత్తాండ్లు. గవాట్లకు గింత కెమికల్స్ యేశి, పచ్చని రంగేసిన గదాన్ని సూదులతోని గా సొనలకు ఇంజెక్షన్ శేత్తాండ్లు. ఇగ గి దీనికి గుడ్డులెక్క పొర రావడాన్కి, ఓ మిషిన్లేసి తీత్తాండ్లు. గంతే గుడ్డు రెడీ అయితాంది ఇగో గిదైతే గా యీడియలో ఉన్నది గనీ, నమ్మాలో నమ్మొద్దో, తెలుత్తలేదు. గనీ మనమైతే ఈ నకిలీలతో జాగ్రత్తగ ఉండాలె! ఏమంటరు?

