గిప్పుడంటే కరెంటున్నది గనీ, ఎనుకటికి కరెంటే లేకపాయె. గప్పుడు శిమ్నీలు, దీపాల కిందనే గడిశేది. కొవ్వత్తులు గూడ వెలిగించేది. ఇగ గిప్పుడు గా కొవ్వత్తులు, దీపాలు గూడ లేకుండనే పాయె.
ఎప్పుడన్న దబ్బున కరెంటు పోతే ఏం జేస్తం? ఆగమాగమైతం. శేతుల ఉన్న ఫోన్ల లైటు పెట్టుకుంటం. ఇగ గది గూడ లేనొల్లేం శెయాలె? మన పెయి సబ్బుంటది గద. గదాన్ని దీసుకోవాలె. గ దానికి దారం పట్టేంత గాల పెట్టాలె. అందుల దారం పెట్టి, గా గాలను మూయాలె. అగ్గిపెట్టెతోటి ఎలిగియ్యాలె. గంతె.

