సుట్టాలొచ్చినా, నలుగురు దంటగాళ్ళు కలిసినా ఏం జేస్తం? ఆయింత గా పక్కనున్న దుకుణంలకు పోతం. కూల్ డ్రింకియ్యమని తాగుతం. తాగిపిస్తం. దూపైనా కూల్ డ్రింకే తాగుతానం. ఇగ గీ కూల్ డ్రింకునైతె మన పొల్లగాండ్లు ఇష్టంగా తాగుతరు. కూలోల్లకు గూడ గీ కూల్ డ్రింకును పోయకపోతే పనికే వత్తలేరు. ఇగ గిది ఎంత మర్యాదగ అయిందంటే. చాయ్ నీళ్ళకంటే గూడ ఎక్కువైంది. ఇండ్లల్ల గా సల్లటి ప్రిజ్జులల్ల సీసాలకు సీసాలు పెట్టుకుని మరీ తాగుతున్నరు. కనీ గీ కూల్ డ్రింకు పనితనం ఎట్లుంటదో ఒకాయిన జేసి చూపిచ్చిండు. చూడుండ్లి.
ఒక గాజు గిలాసల బాగా సిలుం పట్టిన ఇనుప పానను పెట్టిండు. ఇగ గండ్లింత సగం మునిగెటట్లు కూల్ డ్రింకు పోసిండు. కొన్ని గంటల తర్వాత గ పానను దీస్తే, కూల్ డ్రింకుల మునిగిన కాడికి సిలుమంత పోయి తెల్లగ స్టీలు లెక్క అయింది. గంత సిలుమును సిటికెల దీసిన గీ కూల్ డ్రింకు మన శెరీరంలకు పోతే ఇగ ఎట్లుంటదో సూడుండ్లి. ఇప్పటికే పురుగుల మందుగ గూడ గొట్టిండ్రట. ఉన్నదున్నట్లు శెప్పిన. ఇగ తర్వాత మీ ఇష్టం.

