
ఏ తియ్… గిదేం ఇచ్చెంత్రం!? టీవీ అంటేనే సూత్తె సున్నితంగ, నాజూగ్గ ఉంటది. అద్దం గిద్దం పల్గకుండ పైలంగ సూసుకోవాలె. గిదేంది మల్ల? ఎక్కి తొక్కినా కరాబు కాని టీవీ ఉంటాది? ఎట్లుంటది?
నిజమే గనీ, గసొంటి టీవీలు గూడ బజార్లకు వచ్చినయి ఉల్లా… ఒకప్పుడు సీఆర్టీ (క్యాథోడ్ రే ట్యూబ్) టీవీ ఉండేది. గది పాతబడిపోయింది. గవైతే ఎక్కడా కనిపిత్తనే లేవు. ఇగ ఎల్సీడీ (లిక్విడ్ క్రిస్టల్ డిస్‌ప్లే) టీవీ వచ్చింది. గదానికి మించి ఎల్యీడి(లైట్-ఎమిటింగ్ డయోడ్) టీవీ వచ్చింది. ఇగ గిదీన్ని మించి, ఓఎల్యీడీ (ఆర్గానిక్ లైట్-ఎమిటింగ్ డయోడ్) టీవీ వచ్చింది. ఇగ గిదీన్ని గూడ మించి, క్యూఎల్యీడీ (క్వాంటం డాట్ లైట్-ఎమిటింగ్ డయోడ్) టీవీ వచ్చింది. యే టీవీలు వచ్చినా, బొమ్మ బాగ కనిపించేటందుకేనాయె.
ఇగ గీ టీవీలన్ని కింద పడినా, ఎటమంటంగా పట్టుకున్నా పగిలిపోబట్టె. గిదంత పని గాదని ఒకాయెనె ఇంకో రకం టీవీని కనిపెట్టిండు. గా టీవీ ప్లాస్టిక్ ది. మల్ల గదాన్ని ఎటంటే గటు మల్సుకోవచ్చట. కింద పడేసి తొక్కినా సరే, గా టీవీ గింత గూడ కరాబు కాదట. బలే మంచిగుంది గదా? గీ ఫోల్డెబుల్ టీవీ. ఇగ గిసొంటి టీవీ కొంటే, కర్సు తక్కువ. కరాబు గూడ తక్కువే. ఇంకెందుకు ఆల్సెం?

