నమ్మకం నమ్మకమే. నమ్మిందాన్ని ఆచరించి తీరాలె. గట్లనే ఒకాయిన శేసిండు. గనీ గదాన్ని జూసి గిదేం నమ్మకం? అనుకుంటాండ్లు చూసినోల్లు.
మనం అవును పూజిస్తం. గోవును దేవుని లెక్క కొలుస్తం. శుబ కార్యాలకు గా ఆవు పెండను, ఆవు పంచకాన్ని, ఆవు నెయ్యిని ఉపయోగిస్తం. గట్లనే కొత్తగ ఇండ్లండ్లకు పోతే ముందుగనే గా ఆవును అండ్లకు తోల్తం. గట్ల జేస్తే మంచైతదని ఓ నమ్మకం. గని గీ కాలంల గోవులేడుంటానయి? కుక్కలను సాదుకునుడు అలవాటైనంక, ఆవులనెవలు సాత్తాండ్లు?
ఒగూర్ల ఒగాయనె ఓ ఇల్లు కట్టుకుండు. ఇగ ఇండ్లల్లకు పోవాల్ననుకున్నడు. ఇగ ఎంత ఎదికినా గా గోవు దొరకలే. ఏం చేయాల్నని ఆలోశించిండు. ఇగ ఆవు లేకపోతే లేకపాయెనని, ఆవు బొమ్మను తెప్పిచ్చిండు. ముందుగాల గా ఆవు బొమ్మకు పూజలు శేపిచ్చి, గాయింత గా ఆవు బొమ్మను గా ఇంట్లకు తోల్పిచ్చిండు. ఐటెంక గా ఇంట్లకు గా వాల్లు పోయిండ్లట. గిది గాయింత సొసల్ మీడియల ఎవలో పెట్టిండ్లు. గంతే ఇగ గా పోస్టుకి ఒకటే లైకులు…కామెంట్లు… నడుస్తనే ఉన్నయి.

