గీ మద్దెల జనాలకు రీల్స్ పిచ్చి ముదిరింది. కట్టమొచ్చిన, సుకమొచ్చిన, ఏది వచ్చినా ఆగుతలేరు. బస్సుల్ల, రైల్లల్ల, యిమానంల పోతూ, యేడ బడితే గాడ గీ రీళ్ళు శేస్తున్నరు. రీలు శేసుడు, గదాన్ని సోసల్ మీడియల పెట్టుడు. గా దానికి ఎన్ని లైకులు, కామెంట్లు ఒచ్చినయో సూసుడు, మురుసుడు. అదో పిచ్చి అయిపోయింది. గసొంటిదే గిది.
గీ ముచ్చటేందంటే మొన్న మొంథా తుపాను వచ్చింది గద. ఇగ గా తుపానుకు ఊళ్ళకు ఊళ్ళే మునిగిపోయినయి. ఇగ ఇండ్లు గూడ మునిగిపోయి, మనుసులు మస్తు ఆగమాగమైండ్లు. గట్లనే ఒకామె ఇల్లు కూడా గా నీల్లల్ల మునిగింది. గామెమైనా ఇల్లు మునిగింది గదా! అని బాధపడుకుంట ఊకున్నాది? ఊకోలే.. గదాన్ని గూడ రీల్ శేసింది. ‘ఇగో మా ఇంట్లకు నీల్లొచ్చనియి. ఇంట్ల గ్యాస్ సిలండర్ గూడ మునిగిదనుకుంట’, ముచ్చట సెప్పుకుంట, రీల్ దీసింది. ఇగ గా ఈడియోని సోసల్ మీడియల పెట్టింది.
గంతే ఇగ నెటిజన్లు ఊకోరు గద! ‘గిదేం పిచ్చి!’ అని ఒకరు, ‘ముందు నీ ఇల్లు సూసుకో!’ అని ఇంకొకరు, ‘పిచ్చికి మరో రూపం గీ ఈడియో!’ అని ఇంకొకరు కామెంట్లు శేశిండ్లు. గిదంత సూసిన ఇంకొందరు ‘ఏందిర గీ గోల!’ అని ముక్కున యేలేసుకున్నరు.
….

