
ఇగో గీ రోజుల్ల.. ఎవ్వలి శెవుల్ల సూసినా, ఎవ్వలి శేతుల్ల సూసినా పోనే. పోను లేని మనిషే కనబడ్తలేడు. ఇగ గా పోన్ వాడేటోల్ల కోసం ఇగో గీ ఇకమతు కనిపెట్టిండో స్మార్ట్ పోను యూజర్. గదేందో చూద్దాం.
ఇగ గా పోను మాట్లాడంగ మాట్లాడంగ పాతదైపోతది. దుమ్ముకొట్కపోయి సరిగ్గ యినబడది. గా పోన్ల శెత్తా శెదారాన్ని తీయాలంటే మంచి ఇకమతు ఉంది. గదేందంటే… మన పొల్లగాండ్లు తినే బుబుల్ గమ్ ఉంటది గద. గదాన్ని తీస్కోవాలె. తెరిసి, బబుల్ గమ్ ను ముద్ద లెక్క శేయాలె. గా ముద్దను పోను స్పీకర్ పొక్కలకు లోపలకి పోయేటట్లు ఒత్తాలె. ఇగ మెల్లగ గదాన్ని యెనుకకు తీయాలె. గంతే, గా స్పీకర్లల్ల ఉన్న మట్టి అంతా గా బబుల్ గమ్ కు అతుక్కొని బయటకు వత్తది. పోను మంచిగ యినబతది గంతే. ఎట్లుంది గీ శిట్కా?

