ఇగో ఇకమతుండాలె గనీ, ఏ పైనా మస్తుగ శేయొచ్చు. మన ఇండ్లల్ల కరెంటు స్విచ్చు బోర్డులుంటయ గద. గయి గూడ మరకలై మసిబట్టినట్లయితయి. గవాట్ని తెల్లగ మెరిసేటట్లు జేసే గీ శిట్కా ఇకమతును జూడుండ్లి.
గింత నూనె తీసుకోండ్లి. గా నూనెను పత్తికద్ది, గా స్విచ్చు బోర్డుల మీద రుద్దుండ్రి. కొద్దిసేపైనంక మనం మొకానికి యేసుకుంటుం గద. గా పౌడర్ ని మల్ల గా పత్తికింత అద్ది తుడువుండ్రి. గంతే. గా స్వీచ్చుల బోర్డులు మరకలన్ని బోయి, అద్దం లెక్క మెరుస్తయి. ఎట్లుంది గీ శిట్క?

