గీ కాలంల ఎవల దగ్గర సూసినా, సెల్ పోనేనాయె. ఇగ గా ఫోన్ ని శేతుల పట్టుకొని ఎంత కాలమని ఉంటం. కాసేపు పక్కన పెట్టాలంటే అయితాది? ఏం సూడాలన్నా, సూడొద్దన్నా పోను సూసుడేనాయె. పానం పోయినా, పోను ఒదిలేటట్లు లేరాయె. మరి ఊకె పోను సూసెటోల్లకు శేతుల పట్టకునే రికాం ఇచ్చేటందుకు గా పోను స్టాండ్లను కనిపెంట్టిండ్లు. ఇగ గదానికి పైసలతయి కద. గదాన్ని ఇంట్లనే శేసుకుంటే ఎట్లుంటది?
ఒకాయెనె శిన్న రాతెండి శీకు ముక్కును తీసుకుండు. గదాన్ని ఒక్కతీర్గ మూడు దిక్కులకు మలిసిండు. ముందుగ ‘యు’ లెక్క, తర్వాత ‘వి’ లెక్క, శివరకు కొండ్ల లెక్క మల్సిండు. గంతే, పోను స్టాండ్ తయారైంది.
ఇగో ఊకె పోను సూసుడే కాదల్ల. చేతులకు శెమ లేకుండ గూడ శేసుకోండ్లి.

