
గిదేంది? గడ్డాలొచ్చిన బిడ్డను ఎవలో అడ్డంగా నరికినట్లు గీ తల్లేంది గట్ల మొక్కుతాంది? గిది బలే గమ్మత్తుగుంది గదా!
నిజమేనుల్లా… గా తల్లిబాద గసొంటిదే. చత్తీస్ గఢ్ రాస్ట్రం సరగొండిల ఓ అవ్వ ఇరవై ఏండ్ల కింద ఓ మొక్కను నాటింది. కన్న బిడ్డ లెక్క, కంటికి రెప్పలాగా సాదింది. పెంచి పెద్ద జేసింది. ఇగ గా మొక్క పెరిగి, పెద్ద మానైంది. గీ మద్దల్నే గా రియలెస్టేటోల్లు వచ్చి, గాయింత గా శెట్టును నరికేసిండ్లట. ఇగ గా తల్లి తన కన్న బిడ్డ సచ్చిపోయినట్లే ఎక్కిఎక్కేడ్సిందట. ఐటెంక గా శెట్టుకు ఇగో గిట్ల గీ తల్లి దండం పెట్టి కడసారి యీడ్కోలు పలికింది. నిజంగనే గదా. మనమైతే శెట్లను ఎట్లబడితే గట్ల నరకబడ్తిమి. గా తల్లిని సూసి నేర్సుకుందాం!

